ICC World Cup 2027 | 2027 వన్డే వరల్డ్‌ కప్‌: షెడ్యూల్‌‌ విడుదల.. ఆసీస్‌తో భారత్ తొలి పోరు, పాక్‌తో మ్యాచ్ ఆ రోజే!

అక్టోబర్ 7న జరిగే ఈ మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: ICC World Cup 2027 | .ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌-2027 (ICC ODI World Cup 2027) సమరానికి వేళయైంది. టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 2027 అక్టోబర్ 7 నుంచి నవంబర్ 21 వరకు ఈ క్రికెట్ మహాసంగ్రామం సాగనుంది.

ICC World Cup 2027 | ఆసీస్‌తో బోణీ.. పాక్‌తో హైవోల్టేజ్ సమరం!

భారత జట్టు తన తొలి పోరులోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 7న జరిగే ఈ మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. ఇక క్రికెట్ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ పోరు అక్టోబర్ 10న జరగనుంది.

Telangana DA Hike | ఉద్యోగులు, పెన్షనర్లకు పండగ కానుక.. రెండు డీఏల పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర!

ICC World Cup 2027 | వరల్డ్‌ కప్‌ 2027లో భారత లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్:

అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా

అక్టోబర్ 10: భారత్ vs పాకిస్తాన్

అక్టోబర్ 14: భారత్ vs అఫ్గానిస్తాన్

అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్-ఎ

అక్టోబర్ 24: భారత్ vs జింబాబ్వే

ICC World Cup 2027 | నాకౌట్ పోరు ఎప్పుడంటే..

లీగ్ దశ ముగిసిన అనంతరం అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్ల మధ్య నాకౌట్ సమరం జరగనుంది.

మొదటి సెమీఫైనల్: నవంబర్ 17

రెండో సెమీఫైనల్: నవంబర్ 18

ఫైనల్ మ్యాచ్: నవంబర్ 21

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో భారత్ మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *