Telangana Inter Internal Marks | ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్​..ఫస్టియర్‌లోనూ ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్!

ఫస్టియర్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలను సెకండియర్‌లో చేయడం వల్ల విద్యార్థులు, లెక్చరర్లు ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Inter Internal Marks | తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యాశాఖ చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) నూతన అసెస్మెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరం (First Year) విద్యార్థులకు కూడా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Telangana Inter Internal Marks | 80:20 నిష్పత్తిలో మార్కుల కేటాయింపు

సీబీఎస్ఈ (CBSE) తరహాలోనే ఇకపై తెలంగాణ ఇంటర్ బోర్డు పరిధిలోని లాంగ్వేజెస్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రూపులన్నింటికీ ఇంటర్నల్స్ వర్తిస్తాయి.

  • థియరీ పరీక్షలు: 80 శాతం మార్కులు
  • ఇంటర్నల్ అసెస్మెంట్: 20 శాతం మార్కులు

ఈ కొత్త విద్యా విధానానికి అనుగుణంగా త్వరలోనే పాఠ్యాంశాల్లో (Syllabus) కూడా అవసరమైన మార్పులు చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. నామమాత్రపు చదువులకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం, నైపుణ్యాలను (Skills) పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.

ICC World Cup 2027 | 2027 వన్డే వరల్డ్‌ కప్‌: షెడ్యూల్‌‌ విడుదల.. ఆసీస్‌తో భారత్ తొలి పోరు, పాక్‌తో మ్యాచ్ ఆ రోజే!

Telangana Inter Internal Marks | తొలి సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్!

ప్రస్తుతం ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC) గ్రూపులకు సంబంధించి మొదటి సంవత్సరంలో కేవలం థియరీ పరీక్షలే (470, 440 మార్కులకు) నిర్వహిస్తూ, ప్రాక్టికల్స్ మొత్తాన్ని సెకండియర్‌లోనే పూర్తి చేస్తున్నారు. ఫస్టియర్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలను సెకండియర్‌లో చేయడం వల్ల విద్యార్థులు, లెక్చరర్లు ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఇకపై ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నూతన విధానంతో విద్యార్థులపై పరీక్షల భారం తగ్గడమే కాకుండా, కాన్సెప్ట్‌లపై మెరుగైన పట్టు సాధించేందుకు అవకాశం లభిస్తుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *