అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 02 Horoscope | లక్ష్మీదేవి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి నేడు (శుక్రవారం, అక్టోబరు 02) అకస్మాత్తుగా ఊహించని ధనలాభాలు కలగబోతుండగా.. మరికొన్ని రాశుల వారికి గ్రహ స్థానాల మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
చిరకాలంగా నిలిచిపోయిన పాత బాకీలు వసూలవ్వడం, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదరడం వంటి సానుకూల మార్పులు ఉన్నప్పటికీ, ఉద్యోగంలో చిన్నపాటి ఒత్తిడులు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
Oct 02 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Oct 02 Horoscope | ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటారు. భవిష్యత్తులో మంచి విలువ పెరిగే ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార భాగస్వాములు లేదా సహచరులు మీ ఆలోచనలకు పూర్తి మద్దతుగా నిలుస్తారు.
వృషభ రాశి: Oct 02 Horoscope | మీలోని ఓర్పు మిమ్మల్ని ప్రతికూల ఆలోచనల నుండి కాపాడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు వసూలై ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయాణాల్లో లేదా బయటకు వెళ్లినప్పుడు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.
మిథున రాశి: Oct 02 Horoscope | ఆరోగ్యం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరం. ఉద్యోగంలో ఇతరుల అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ప్రతిష్టను పాడుచేసుకోవద్దు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో మీరు, మీ భాగస్వామి ఒక అద్భుతమైన శుభవార్త వింటారు.
సింహ రాశి: Oct 02 Horoscope | ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో జరిగే వేడుకల్లో లేదా సమావేశాల్లో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లావాదేవీల పట్ల అప్రమత్తత అవసరం.
Hyderabad Police Reorganization | హైదరాబాద్ పోలీస్ పరిధి పునర్వ్యవస్థీకరణ..76 ప్రాంతాల్లో మార్పులు!
కన్యా రాశి: Oct 02 Horoscope | మీకున్న ఆత్మవిశ్వాసం, ప్రణాళికల వల్ల పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. ప్రేమ, స్నేహ సంబంధాలు మరింత బలపడి మనసుకు ఆనందాన్నిస్తాయి. తొందరపాటు మాటల వల్ల కుటుంబ సభ్యుల మనసు నొచ్చుకోకుండా చూసుకోవడం మంచిది.
తులా రాశి: Oct 02 Horoscope | స్థలాలు లేదా ఆస్తులు అమ్మాలనుకునే వారికి ఇవాళ మంచి లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగ భాగస్వాములు మీ ప్లాన్లకు పూర్తి మద్దతుగా నిలుస్తారు.
మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకపోవడం ఎంతో మేలు.
వృశ్చిక రాశి: Oct 02 Horoscope | మీ ఆలోచనలు ఎప్పుడూ సానుకూలంగా ఉండేలా జాగ్రత్త పడండి. అసాధ్యమైన ప్రణాళికల వల్ల ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యం. వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా ఊహించని లాభాలు అనుకూల పొందుతారు. ఖాళీ సమయంలో ఆహ్లాదంగా గడపడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
ధనుస్సు రాశి: అనుకోని మార్గాల ద్వారా ధనం అంది మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి కొద్దిపాటి వ్యతిరేకత వచ్చినా సహనం వహించండి. ఇతరులకు సహాయం చేసే మీ గుణం సమాజంలో మంచి గౌరవాన్ని ఇస్తుంది. మెరుగైన ఆరోగ్యం కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
మకర రాశి: చాలా కాలంగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల వార్త అందుతుంది. కుటుంబంలోకి కొత్త సభ్యుల రాక గురించిన వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. పాత స్నేహం మరింత బలపడి ప్రేమగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కుంభ రాశి: ఇవాళ మీరు ఎంతో ఆశాజనకంగా , ఉత్సాహంగా ఉంటారు. చాలా కాలంగా రావాల్సిన బాకీలు చేతికి అంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల స్కూల్ ప్రాజెక్ట్‌లలో వారికి మీ తోడ్పాటు ఎంతో అవసరమవుతుంది. వైవాహిక జీవితంలో బంధువుల జోక్యం వల్ల చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు.
మీన రాశి: భవిష్యత్తుపై దృషి పెట్టడం ఎంతో అవసరం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు లేకుండా తెలివిగా పెట్టుబడులు పెట్టండి. మీ మనసుకు నచ్చే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగంలో మీరు చేసే మంచి పనులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.