అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Police Reorganization | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత సులభతరం చేసేందుకు, పరిపాలనా సౌలభ్యం దిశగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
నగర విస్తరణ, జనాభా పెరుగుదలకు అనుగుణంగా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీగా పునర్వ్యవస్థీకరణ చేపడుతూ హోంశాఖ జీవో ఎంఎస్ నంబర్ 84 (G.O.Ms.No.84) జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం పలు జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో స్పష్టమైన మార్పులు చేశారు.
Hyderabad Police Reorganization | శంషాబాద్ పీఎస్‌గా ‘ఆర్‌జీఐఏ’!
నగరవ్యాప్తంగా దాదాపు 76 ప్రాంతాలకు సంబంధించి పోలీసు పరిధులను సరికొత్తగా పునర్విభజించారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్ కిందికి మార్చారు. మహేశ్వరం, సైబరాబాద్ పరిధుల్లోనూ పలు సవరణలు జరిగాయి.
శంషాబాద్ డివిజన్ పరిధిలోని ప్రముఖ ‘ఆర్‌జీఐఏ (RGIA) పోలీస్ స్టేషన్’ పేరును ఇకపై ‘శంషాబాద్ పీఎస్’గా మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్‌లతో పాటు రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్ మెట్, మీర్‌పేట్ స్టేషన్ల సరిహద్దులనూ పునర్విభజించారు.
Telangana DA Hike | ఉద్యోగులు, పెన్షనర్లకు పండగ కానుక.. రెండు డీఏల పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర!
Hyderabad Police Reorganization | ప్రత్యేక విభాగాల్లోనూ మార్పులు
లా అండ్ ఆర్డర్‌తో పాటు ప్రత్యేక విభాగాల పనితీరును మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- ట్రాఫిక్ విభాగం: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వీలుగా డివిజన్లు, జోన్లను కొత్తగా వర్గీకరించారు.
- ఉమెన్ సేఫ్టీ వింగ్: మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా కొత్త జోన్లను కేటాయించారు.
- జోనల్ సైబర్ సెల్: నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసి బాధితులకు త్వరితగతిన సేవలు అందించేలా సైబర్ సెల్ పరిధులను పునర్వ్యవస్థీకరించారు.
ఈ కొత్త సరిహద్దులు, పునర్విభజన అమలులోకి రావడంతో నగరవాసులకు పోలీసు సేవలు మరింత చేరువకానున్నాయి.