అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGSRTC Metro Common Pass | గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరియు మెట్రో యాజమాన్యం కలసి ఒకేసారి అత్యంత తీపి కబురును అందించాయి. నగరంలో పెరుగుతున్న రద్దీకి చెక్ పెడుతూ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత సులభతరం చేసేందుకు ‘కామన్ పాస్’ (జాయింట్ పాస్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి.
TGSRTC Metro Common Pass | పాస్‌ల వివరాలు ఇలా..
ఈ నూతన విధానంతో ఒకే పాస్ ఉపయోగించి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కలగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా అధికారికంగా ఈ పథకం శుక్రవారం ప్రారంభం కానుంది.
కామన్ పాస్ ధరల వివరాలు..
- డైలీ పాస్ (రోజువారీ): ₹400
- మంత్లీ పాస్ (నెలకు): ₹8,500
- వీక్లీ పాస్ (వారం రోజులకు): ప్రయాణికుల అవసరార్థం వారం రోజుల పాస్‌ను కూడా ప్రవేశపెట్టారు.
TGSRTC Metro Common Pass | ‘మీ టికెట్’ యాప్‌తో డిజిటల్ విప్లవం
కేవలం కంబైన్డ్ పాస్ మాత్రమే కాకుండా, ప్రయాణికులు కండక్టర్‌తో ప్రమేయం లేకుండానే తమ మొబైల్ ద్వారా నేరుగా టికెట్లు కొనుగోలు చేసే సౌకర్యాన్ని తెచ్చారు. అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ (Mee Ticket) యాప్ ద్వారా రోజువారీ టికెట్లు, డే పాస్, వీక్లీ పాస్, మంత్లీ పాస్ పొందొచ్చు.
Hyderabad Police Reorganization | హైదరాబాద్ పోలీస్ పరిధి పునర్వ్యవస్థీకరణ..76 ప్రాంతాల్లో మార్పులు!
ఇలా అన్ని రకాల సేవలను ఫిజికల్ టికెట్ అవసరం లేకుండానే మొబైల్ లోనే సులభంగా పొందే వీలు కల్పించారు. మెట్రో, బస్సు ప్రయాణాలు రెండింటికీ ఉపయోగపడే ఈ డిజిటల్ కామన్ పాస్ విధానం నగర్ వాసులకు ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా గణనీయంగా ఆదా చేయనుంది.