Suryapet ACB Trap | బోరు వేయడానికి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన భూగర్భ జల అధికారి

సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryapet ACB Trap | సూర్యాపేట జిల్లా భూగర్భ జల శాఖ కార్యాలయంలోని జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఫిర్యాదిదారుడి బోర్‌వెల్ డ్రిల్లింగ్ రిగ్‌కు అనుమతి మంజూరు చేయడం, అనవసరమైన జరిమానాలు విధించకుండా లేదా రిగ్‌ను స్వాధీనం చేసుకోకుండా ఉండటం కోసం బాలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధతుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం ఫిర్యాదుదారుడి నుంచి కార్యాలయంలోని ఆపరేటర్​ కోసనోజు వెంకటేశ్వర్లు ద్వారా రూ.20 వేల లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులు వల పన్ని ఆపరేటర్​ వెంకటేశ్వర్లుతో పాటు, భూగర్భ జల అధికారి బాలును రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.

Suryapet ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలి.. లేకపోతే నిరాహార దీక్ష చేస్తా : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *