అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponnam Prabhakar Counter | భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ వస్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ నాయకులు రాహుల్ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.
రాహుల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ర్యాప్ సాంగ్‌ను విడుదల చేసింది. ఆరు గ్యారంటీలు, హామీలపై ప్రశ్నిస్తూ పాడిన పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు కేటీఆర్ సైతం రాహుల్ పర్యటనపై విమర్శలు చేశారు. ఆయన ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
Ponnam Prabhakar Counter | కేటీఆర్‌కు అంత సీన్ లేదు
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్‌కు లేదని పొన్నం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో నేరెళ్ల దళితుల దాడి, ఖమ్మంలో రైతులకు బేడీలు, మల్లన్న సాగర్ బాధితుల మీద లాఠీ ఛార్జి చేశారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారా అన్నారు. తాము మాత్రం గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. బీఆర్ఎస్ నేతల్లాగా వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదన మీద తమకు ఆసక్తి లేదన్నారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. అవినీతి గురించి కేటీర్ మాట్లాడటం అంటే వింతగా ఉందన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని కేటీఆర్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు.. అసైన్ ల్యాండ్ లు .. ఇలా చెప్పుకుంటూ పోతే.. వారి అవినీతిలెక్కలు చెప్పడానికి ఒక ఏడాది పడుతుందన్నారు.
ఇది కూడా చదవండి..: KTR Criticism | రాహుల్‌గాంధీ పర్యటనపై కేటీఆర్ విమర్శలు