అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Criticism | లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం పోరాడిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగినప్పుడు ఎక్కడకు వెళ్లారన్నారు. లగచర్ల గిరిజన మహిళలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేసినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. కంచ గచ్చిబౌలిలో వేలాది చెట్ల నరికివేత, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
KTR Criticism | హామీలు ఎక్కడ..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడకు పోయాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు వచ్చిన హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజాధనంతో నిర్వహిస్తున్న సభకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నప్పుడు, మహిళా శాసనసభ్యుల చీరలను లాగి, అసెంబ్లీ ముందు కొట్టినప్పుడు రాహుల్ ఒక్క మాటైనా మాట్లాడారా అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బరితెగించిన అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి..: Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం