Sajjanar Controversy | వీసీ సజ్జనార్​పై రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్​ నగర మాజీ కమిషర్​ వీసీ సజ్జనార్​పై రిటైర్డ్​ ఐపీఎస్​ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sajjanar Controversy | హైదరాబాద్​ (Hyderabad) నగర మాజీ కమిషర్​ వీసీ సజ్జనార్​పై రిటైర్డ్​ ఐపీఎస్​ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్​ను బదిలీ చేయడంపై సీఎం రేవంత్​రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్​కు ధన్యవాదాలు తెలిపారు. సజ్జనార్​ను ఆయన ‘యూనిఫాం ధరించిన నేరస్థుడు’గా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా పోస్ట్ పెట్టారు.

Sajjanar Controversy | బాధ కలిగిస్తోంది

వీసీ సజ్జనార్​ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను హైదరాబాద్​ సీపీ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. నూతన సీపీగా మహేశ్​ భగయత్​కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో రిటైర్డ్​ ఐపీఎస్​ నాగేశ్వరరావు స్పందిస్తూ.. ఒకప్పటి సహోద్యోగిని ‘యూనిఫాం ధరించిన నేరస్థుడు’ అని విమర్శించడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. కానీ ఇది వాస్తవం అన్నారు. వ్యక్తిగత సాన్నిహిత్యం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమైనవి, తప్పును తప్పు అని చెప్పక తప్పదన్నారు.

Sajjanar Controversy | విచారణ జరపాలి

బదిలీ అనేది శిక్ష కాదని, అది చేసిన నేరాలను తుడిచిపెట్టలేదని నాగేశ్వరరావు పేర్కొన్నారు. సజ్జనార్​ పాల్పడిన అన్ని నేరపూరిత కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయనను చట్టం ముందు నిలబెట్టడం ద్వారానే ఈ వ్యవస్థలోని అక్రమాలను, అవినీతిని పూర్తిగా తొలగించడం సాధ్యమవుతుందన్నారు. ఆయన ట్వీట్​పై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్​లో భారీ అగ్నిప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *