అక్షరటుడే, వెబ్డెస్క్ : Yamuna River | యమునా నదిలో చనిపోయిన చేపలు తేలుతూ కనిపించాయి. దీంతో బీజేపీ, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య రాజకీయ మాటల యుద్ధానికి దారితీసింది. ఛత్ పూజ పండుగకు ముందు ఢిల్లీ (Delhi)లోని సోనియా విహార్ ప్రాంతంలో యమునా నదిలో చనిపోయిన చేపలు కనిపిస్తున్న దృశ్యాలను సోషల్ మీడియా పలువురు పోస్ట్ చేశరాఉ.
ఈ ఘటనపై రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి పర్వేశ్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే చనిపోయిన చేపలను నదిలో పడేశారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), “ఈ నీరు చేపలకే సురక్షితం కానప్పుడు, ఇక మనుషులకు ఎలా సురక్షితం?” అని ప్రశ్నించింది.
Yamuna River | ఎఫ్‌ఐఆర్ నమోదు
ఢిల్లీలో వినోదభరిత రివర్ క్రూయిజ్ సేవ ‘నమో యమునా రివర్ సఫారీ’ ప్రారంభం అయిన మరుసటి రోజే చనిపోయిన చేపలు కనిపించాయి. దీనిపై మంత్రి పర్వేశ్ వర్మ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చనిపోయిన చేపలను నదిలో పడేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు తెలిపారు. నదిలో ఫెర్రీ సేవలు ప్రారంభమైన మరుసటి రోజే, ఎవరో చనిపోయిన చేపలను నదిలో పడేస్తున్నారని అధికారులు తనకు సమాచారం అందించారన్నారు. ఈ పని చేసిన వారు ఎవరు, వారికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Suryakumar Yadav Politics | బీజేపీలోకి సూర్యకుమార్ యాదవ్? మోదీ, అమిత్ షాలతో వరుస భేటీల వెనుక అసలు వ్యూహం ఇదేనా..