నిజామాబాద్Rah Veer Puraskar | ప్రాణాలు కాపాడితే రూ.25 వేల నజరానా..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Rah Veer Puraskar | ప్రాణాలు కాపాడితే రూ.25 వేల నజరానా..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర్‌’లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రహ వీరుల పథకంపై సమీక్ష నిర్వహించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Rah Veer Puraskar | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర్‌’లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రహదారి వీరుల పథకంపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష నిర్వGayatri Sugar Factoryహించారు.

Rah Veer Puraskar | ప్రమాదం జరిగిన వెంటనే..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ రహదారి వీరులుగా మారాలని పిలుపునిచ్చారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీని (District Appreciation Committee) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, డీటీవో (DTO), డీఎంహెచ్​వో (DMHO) సభ్యులుగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రోడ్డుపై కొట్టుకుంటున్న ప్రాణాన్ని కాపాడితే ప్రభుత్వం ఇచ్చే రూ.25 వేలు కేవలం గుర్తింపు మాత్రమేనన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం కూడా ప్రాణం తీస్తుందని, సకాలంలో స్పందించే వ్యక్తి చొరవ ఒక కుటుంబానికి దీపం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రజలు, అధికారులు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. రహదారి వీరుల పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Rah Veer Puraskar | రహదారుల వెంట ఆక్రమణలను ఉపేక్షించేది లేదు..

రోడ్డు పక్కన ఆక్రమణలే ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయని, వాటిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైవేల వెంట హోటళ్లు, ధాబాలు ఇష్టారీతిన ఏర్పాటు చేసుకున్న అనధికార ప్రవేశ మార్గాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా వేసిన ప్రతి అడ్డదారీ ఒక నిండు ప్రాణం తీస్తోందని, ఇక నుంచి రాకపోకలు రూల్స్ ప్రకారమేనని హెచ్చరించారు. జాతీయ రహదారులపై జంతువులు అడ్డొచ్చి జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జంతువుల అండర్‌పాస్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.

Rah Veer Puraskar | అటవీప్రాంతంలో..

అటవీ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి అనుమతులను త్వరగా తెప్పించాలని అటవీ, ఆర్అండ్​బీ శాఖలకు సూచించారు. సదాశివనగర్ మండలం మల్లుపేట, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ (Gayatri Sugar Factory) వంటి ప్రమాదకర మలుపుల వద్ద రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్ మార్కింగ్‌లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రతి చోటా భద్రతా సూచిక ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రజల ప్రాణ భద్రతే మొదటి ప్రాధాన్యమని, రవాణా, పోలీస్, ఆర్ అండ్​బీ, ఎన్‌హెచ్‌ఏఐ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీటీవో శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఏఐ, అటవీ, ఆర్అండ్​బీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ashish

kamareddy 4

ఇది కూడా చదవండి: DK Shivakumar CM | డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DK Shivakumar CLP Leader |

అక్షరటుడే వెబ్‌డెస్క్: DK Shivakumar CLP Leader | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు...

Retirement Honours | ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Retirement Honours | ప్రభుత్వ సర్వీస్​లో ఉన్నవారికి...

Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

అక్షరటుడే వెబ్‌డెస్క్: Women Auto Driver | ఒకప్పుడు సమాజంలో సాఫ్ట్‌వేర్...

DK Shivakumar CM | డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు

అక్షరటుడే వెబ్‌డెస్క్: DK Shivakumar CM | కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త...