Red Cross Membership | యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Red Cross Membership | యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(collector ashish sangwan) పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో (red cross membership) ఆర్​కే విద్యాసంస్థల సీఈవో, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి రూ.25 వేలతో పాట్రన్ మెంబర్‌గా చేరారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయనను శాలువాతో సత్కరించి సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Red Cross Membership | వైస్​ పాట్రన్​గా సదాశివరెడ్డి..

అదే కార్యక్రమంలో ఎం.సదాశివ రెడ్డి రూ.12 వేలతో వైస్ పాట్రన్ సభ్యత్వం తీసుకోగా కలెక్టర్ మెమెంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్​క్రాస్ వంటి సంస్థలో(indian red cross) ప్రముఖులు చేరడం అభినందనీయమని, జిల్లా యువత సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. డా.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్​క్రాస్ ద్వారా మరింత విస్తృతంగా ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చిందని, ప్రముఖులు, యువత, విద్యార్థులు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గిరి, రెడ్ క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, దత్తాద్రి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *