అక్షరటుడే, వెబ్డెస్క్: HYDRAA Demolitions | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రామాంతాపూర్లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఓ ఇంటిని అధికారులు కూల్చివేశారు.
బాధితుడు మాట్లాడుతూ.. కోర్టు స్టేటస్ కో ఆర్డర్లను లెక్కచేయకుండా కూల్చివేతలు చేపడుతున్నారని వాపోయాడు. 1974లో తన తల్లి అక్కడ ప్లాట్ కొనుగోలు చేశారని, 1980లో ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. 50 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ బిల్లులు అన్నీ కడుతున్నామని తెలిపారు. అయినా కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తమ నిర్మాణాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
HYDRAA Demolitions | కోర్టు చెప్పినా..
హైడ్రా అధికారులు ఇటీవల కొలతలు తీసుకోవడంతో.. అనుమానం వచ్చి తాము కోర్టును ఆశ్రయించామని బాధితుడు తెలిపారు. దీంతో ముందుగా ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని కోర్టు ఆదేశించిందన్నారు. అయినా పట్టించుకోకుండా తమ ఇంటిని కూల్చివేశారన్నారు.
ఇది కూడా చదవండి..: Engineering Students Death | పోలీసులను చూసి భయంతో పరుగు.. కరెంట్ షాక్తో విద్యార్థుల మృతి