Sunnam Cheruvu | సున్నం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి : హైడ్రా కమిషనర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sunnam Cheruvu | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చెరువులకు హైడ్రా (HYDRAA) పూర్వ వైభవం తెస్తోంది. మురికి కూపాలుగా మారిన తటాకాలను పునరుద్ధరించి.. ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటికే బతుకమ్మ కుంట, నల్ల చెరువులను అభివృద్ధి చేసింది.

హైడ్రా ప్రస్తుతం మాదాపూర్‌లోని త‌మ్మిడికుంట‌, సున్నం చెరువులను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. త‌మ్మిడికుంట‌లో పేరుకుపోయిన బ‌యో వ్య‌ర్థాల‌ను తొల‌గించామన్నారు. సున్నం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. తమ్మిడికుంటలో మురుగునీటిని తొల‌గించామన్నారు. మెట‌ల్ చార్మినార్‌వైపు ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను వేరే చేసే యూనిట్లు తొలగించాలని ఆదేశించారు.

Sunnam Cheruvu | వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలి

సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న బండ‌పైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయాల‌ని రంగనాథ్​ సూచించారు. చెరువు చుట్టూ పచ్చదనం పెంచాలని, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డాల‌న్నారు. అంతుకు ముందు కృష్ణాకాంత్​ను ఆయన పరిశీలించారు. కృష్ణాకాంత్ పార్కు చెరువు లోతుతో పాటు విస్తీర్ణం పెరిగితే వ‌ర‌ద‌ను చాల‌వ‌ర‌కు క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చున‌ని తెలిపారు.

 

దీనిని కూడా చదవండి : Kavitha DGP Remarks | డీజీపీ రికమండేషన్‌తో ఉద్యోగంలో చేరారా.. కవిత సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *