KCR Padayatra | లక్ష మందితో కేసీఆర్ పాదయాత్ర: హరీష్ రావు

నీళ్ల కోసం కేసీఆర్​ త్వరలో లక్షమందితో పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR Padayatra | అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) డిమాండ్​ చేశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్​ఎస్​ఎల్పీ (BRSLP) మీటింగ్​ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం (Kaleshwaram), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రత్యక్ష పోరాటం చేస్తారని హరీశ్​రావు అన్నారు. లక్ష మందితో కేసీఆర్ పాదయాత్ర చేస్తానని చెప్పారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని విమర్శించారు. కాళేశ్వరంపై నిర్లక్ష్య ధోరణికి నిరసనగా అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు.

KCR Padayatra | సీఎం సోదరుడికి సెక్యూరిటీ ఎందుకు?

కేసీఆర్ భద్రతకు అయ్యే ఖర్చు గురించి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతున్నారని హరీశ్​రావు అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి రూ.40 కోట్లు ఖర్చు చేసి సెక్యూరిటీ ఇస్తున్నారని పేర్కొన్నారు. అతను కనీసం ఎంపీటీసీ కూడా కాదని, అలాంటి వ్యక్తికి ఎందుకు భద్రత కల్పిస్తున్నారని ప్రశ్నించారు.

KCR Padayatra | కేసీఆర్​ రావాల్సిన అవసరం లేదు

రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బడ్వే లాంటి పదాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యేని లేపి మా వాడు పహిల్వాన్ మర్రేసి కొడతడు, తిర్రేసి కొడతడు, బట్టలిప్పి కొడతడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడే భాష అదేనా అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదన్నారు. ఇవాళ జరిగిన మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇదే అభిప్రాయపడ్డారని చెప్పారు.

KCR Padayatra | ప్రభుత్వాన్ని నిలదీస్తాం

అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని హరీశ్​రావు డిమాండ్ చేశారు. అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, 22A నిషేధిత జాబితాతో ప్రజలకు కలిగిస్తున్న ఇబ్బందులపై ప్రశ్నిస్తామన్నారు. 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అవసరమైతే సభను స్తంభింపచేస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Modi Cabinet Meeting | రేపు మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *