అక్షరటుడే వెబ్‌డెస్క్: Bigg Boss Telugu 10 | బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ‘బిగ్ బాస్ తెలుగు 10 దశావతారం’ పేరుతో వస్తున్న ఈ సరికొత్త సీజన్‌ను సుప్రీమ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ మైలురాయి సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మలుస్తూ.. సౌత్ ఇండియాలోని నలుగురు ప్రముఖ బిగ్ బాస్ హోస్ట్‌లు నాగార్జున, విజయ్ సేతుపతి, మోహన్ లాల్, కిచ్చా సుదీప్ తొలిసారిగా ఒకే వేదికను పంచుకోనున్నారు.
Bigg Boss Telugu 10 | నాగార్జున రీఎంట్రీ..
తనదైన శైలి, ప్రత్యేకమైన కమాండింగ్ ప్రెజెన్స్, అసాధారణ చరిష్మాతో నాగార్జున మరోసారి హౌస్‌ను రూల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన బిగ్ బాస్ రూపం మార్చేలా ఈ సీజన్ ఉండబోతుందని ఆయన రాకతోనే స్పష్టమవుతోంది. ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ‘మిస్టర్ హై’ (Mr. HAI) రోబోట్‌ను తాజా ప్రోమోలో పరిచయం చేశారు. టెక్నాలజీ, పవర్, ఊహించని మలుపులతో హౌస్‌లో సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు ఈ మిస్టర్ హై రోబోట్ ఎంట్రీ ఇస్తోంది. ఇది కంటెస్టెంట్లకు ఎలాంటి సవాళ్లు విసురుతుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Bigg Boss Telugu 10 | సరికొత్త మలుపులు..
ఈ సీజన్ మామూలుగా ఉండదని, అన్నింట్లోనూ పదింతల జోరు ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. 10X ట్విస్టులు, 10X డ్రామా, 10X పవర్స్, 10X ఛాలెంజ్ , X మ్యాడ్నెస్, 10X వినోదంతో దశావతారాల రూపంలో ఈ సీజన్ సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమైంది. ఇక ఈ గ్రాండ్ ప్రీమియర్‌ను మీ టీవీలు, మొబైల్స్‌లో స్టార్ మా (Star Maa) , జియోహాట్‌స్టార్ తెలుగు (JioHotstar )లో ఇవాళ సాయంత్రం 7:00 గంటలకు తప్పక వీక్షించండి.
ఇది కూడా చదవండి: Sunnam Cheruvu | సున్నం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి : హైడ్రా కమిషనర్