NRI Policy | ఎన్​ఆర్​ఐ పాలసీ తీసుకు రావాలి

ఎన్​ఆర్​ఐ పాలసీ తీసుకు రావాలని గల్ఫ్​ కార్మికులు డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: NRI Policy | ఎన్​ఆర్​ఐ పాలసీ తీసుకు రావాలని గల్ఫ్​ కార్మికులు డిమాండ్​ చేశారు. గల్ఫ్​ కార్మిక అవగాహన వేదిక (జీడబ్లూఏసీ) 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబాయిలోని కౌన్సిల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా ఇమ్మడి విష్ణువర్ధన్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

NRI Policy | సమస్యల పరిష్కారం కోసం..

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. గల్ఫ్​ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఏళ్లుగా డిమాండ్​ చేస్తున్న ఎన్​ఆర్​ఐ పాలసీని అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ పోరాటం చేస్తుందన్నారు. పదేళ్లుగా గల్ఫ్​ కార్మికుల అవగాహన వేదిక అనేక కార్యక్రమాలు చేశామన్నారు. గల్ఫ్​ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధనే జీడబ్లూఏసీ లక్ష్యమన్నారు. గల్ఫ్​ కార్మికుల సమస్యలను తమ సంస్థ ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లిందన్నారు. దుబాయిలో జరిగిన ఈ సమావేశానికి పలు ప్రాంతాల్లో పని చేస్తున్న గల్ఫ్​ కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గల్ఫ్​ దేశాలు లక్షల మందికి అన్నం పెడుతున్నాయన్నారు.

ఈ వీడియో చూడండి : గల్ఫ్​ కార్మికుల అవగాహన వేదిక సమ్మేళనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *