KCR Chakali Ailamma | చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం: కేసీఆర్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం, తెలంగాణ సోయికి నిలువెత్తు ప్రతీక చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KCR Chakali Ailamma | తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం, తెలంగాణ సోయికి నిలువెత్తు ప్రతీక చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె చేసిన త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారానే ఆమెకు నిజమైన నివాళి అర్పించినవాళ్లమౌతామని తెలిపారు.

KCR Chakali Ailamma | ఆత్మగౌరవానికి ప్రతీకగా..

రాచరిక పాలనలో తెలంగాణ  ( Telangana )రైతాంగం కోసం ధీరవనిత ఐలమ్మ ధిక్కార స్వరం వినిపించారని, అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి భూస్వాములను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, చట్టబద్ధమైన పోరాటాలు చేసి న్యాయస్థానాలలో గెలిచి ఆమె గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించారని గుర్తుచేశారు. నేటి అస్తవ్యస్త రాజకీయ పరిస్థితుల్లో యువత ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, తెలంగాణ సోయిని తప్పక అనుసరించాలని పిలుపునిచ్చారు. తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలోనూ ఆమె అందించిన స్ఫూర్తి ఎంతో ఇమిడి ఉందని చెప్పారు.

KCR Chakali Ailamma | కులాల అభివృద్ధి కోసం..

ఐలమ్మ గొప్పతనాన్ని భావి తరాలకు అందించేందుకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని తీసుకువచ్చిందని కేసీఆర్ తెలిపారు. ఆమె ఆశయాలకు అనుగుణంగానే పదేళ్ల తమ పాలనలో మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేశామని వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ, కుల వృత్తులకు జీవం పోసి అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టామని, ఆ నమూనా నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  India Women Kabaddi | పసిడి పట్టు.. కబడ్డీలో భారత్​కు గోల్డ్​ మెడల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *