అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే చాలా వరకు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. కొన్ని చోట్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
నిమజ్జన ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 మంది చనిపోయినట్లు డీజీపీ తెలిపారు. ఇందులో ఒక ఎస్సై, 12 మంది పౌరులు ఉన్నారన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద రోడ్డు దాటుతున్న ఎస్సై వెంకన్నను బైక్ ఢీకొనడంతో చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే ఉత్సవాల్లో 26 మంది గాయపడ్డారని సీవీ ఆనంద్ తెలిపారు.
Ganesh Immersion | 1.24 లక్షల విగ్రహాలు
రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో 1.24 లక్షల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారని డీజీపీ తెలిపారు. ఇళ్లు, కార్యాలయాలు, అపార్ట్మెంట్లలో కలుపుకుంటే విగ్కరహాల సంఖ్య 4 లక్షల వరకు ఉంటుందన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించిన అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Man Murdered | గంజాయి సమాచారం లీక్ చేస్తున్నాడనే అనుమానం.. సహచరుడిని దారుణంగా పొడిచేసిన ముఠా