Israel Job Fraud | ఇజ్రాయెల్‌లో ఉద్యోగమిప్పిస్తామని మోసం.. కేసు నమోదు

ఇజ్రాయెల్‌లో ఉద్యోగమిప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Israel Job Fraud | ఇజ్రాయెల్‌లో ఉద్యోగమిప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మోపాల్(mopal police)​ ఎస్సై సుష్మిత వివరాలు వెల్లడించారు.

Israel Job Fraud | మోపాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాల్​కల్ గ్రామానికి చెందిన మద్దె గంగాధర్ అనే వ్యక్తికి ఇజ్రాయెల్ దేశంలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్యోగం, వర్క్ వీసా ఏర్పాటు చేస్తామని నిందితుడు బండారి భూపాల్​ నమ్మించాడు. ఈ క్రమంలో మద్దె గంగాధర్​ నుంచి రూ.7లక్షలు వసూలు చేశాడు. అనంతరం అతడిని విజిట్ వీసాపై ఆ దేశానికి పంపాడు. ఏమైనా తేడా జరిగితే డబ్బులు తిరిగి చెల్లిస్తామని బాండ్ పేపర్‌పై హామీ ఇచ్చినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదుదారుడు గంగాధర్​ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Israel Job Fraud | నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు

ఎస్సై సుష్మిత మాట్లాడుతూ.. విదేశాల్లో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దన్నారు. ముందుగా వారి వివరాలు, సంబంధిత ఏజెన్సీ అనుమతులు, వీసా పత్రాల నిజానిజాలను పూర్తిగా పరిశీలించాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు, అనధికార ఏజెంట్లకు డబ్బులు చెల్లించవద్దని ఎస్సై సూచించారు.

ఇది కూడా చదవండి: అబద్దాలు ఆడడానికి సిగ్గు అనిపిస్తలేదా?- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *