అక్షరటుడే, కామారెడ్డి: Eklavya School Kamareddy | గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. కలెక్టరేట్లో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల జిల్లాస్థాయి పాలక మండలి సమావేశంలో సోమవారం ఆయన పాఠశాల ప్రగతిపై సమీక్షించారు.
Eklavya School Kamareddy | పాఠశాలలో సమస్యలు..
పాఠశాలలోని సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, జిల్లాస్థాయి పాలక మండలి సభ్యులు వారానికి ఒకరు చొప్పున పాఠశాలను సందర్శించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో చేపడుతున్న ఇంజినీరింగ్ పనులను ఈ నెలలోనే పూర్తి చేస్తామని డీఈఈ సంపత్ కుమార్ వివరించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లోని 6,021 మీటర్ల ఎత్తయిన తరంగ్-2 పర్వతాన్ని అధిరోహించిన గిరిజన విద్యార్థి బన్నీని కలెక్టర్ సన్మానించారు. రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన విశ్లావత్ బన్నీ కామారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతూ ఈ ఘనత సాధించారు.
Eklavya School Kamareddy | విద్యతో పాటు సాహస క్రీడల్లో..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యతో పాటు సాహస క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. బన్నీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా తమ ప్రతిభను వివిధ రంగాల్లో చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్, ప్రాంతీయ సమన్వయ అధికారి గంగారాం నాయక్, జిల్లా సంక్షేమాధికారి సౌజన్య, ప్రధానాచార్యులు శ్యామలదేవి, అమర్ సింగ్, మాధవరావు, రవీంద్ర కుమార్, సంతోష్ శుక్లా, సంబంధిత అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Crime Control | నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి