అక్షరటుడే, కామారెడ్డి: Overseas Jobs | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
Overseas Jobs | నర్సింగ్.. ఫిజియోథెరపిస్ట్..
నర్సింగ్, ఆప్టిక్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపంక్చర్, రిజిస్టర్డ్ నర్సులు తదితర విభాగాల్లో విదేశాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కిరణ్కుమార్ పేర్కొన్నారు. విదేశాలలో ఉద్యోగాలు కావాలనుకునేవారు తమ పేర్లను జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారు విదేశాలలో ఉద్యోగం చేయదలచిన వారు మరిన్ని వివరాలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం దుబాయ్, మలేషియా, అమెరికా, ఫిజి, ఆస్ట్రేలియా దేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దుబాయ్లో టైల్స్ మేసన్, స్టీల్ ఫిక్సర్, షట్టరింగ్ కార్పెంటర్, స్కాఫోల్డర్ ఉద్యోగాలకు నెలకు 1,453 దిరమ్స్ (రూ.38 వేలు) జీతం ఉంటుందని, వయస్సు 20 నుంచి 45ఏళ్లు ఉండాలన్నారు. కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు.
Overseas Jobs | జనరల్ హెల్పర్.. కన్ స్ట్రక్షన్ హెల్పర్స్..
జనరల్ హెల్పర్ కు 1,200 దిరమ్స్ (రూ.31,200) జీతం ఉంటుందని, ఏడాది అనుభవం అవసరమన్నారు. మలేషియాలో హెవీ వర్క్స్, కన్ స్ట్రక్షన్ హెల్పర్స్, స్టీల్ ఫిక్సర్, పైప్ వెల్డర్, ఎక్స్ కవేటర్, బ్యాక్ హో ఆపరేటర్లకు ఫ్రెషర్స్ కు 1,700 రింగిట్స్ (రూ.40,298) వేతనం ఉందని, అనుభవం ఉన్నవారికి 1,800 నుంచి 2,000 రింగిట్స్ (రూ.42,668 నుంచి 47,409) వరకు జీతం ఉంటుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత, 20 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన ఫ్రెషర్స్, అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అమెరికాలో రిజిస్టర్డ్ నర్స్ ఉద్యోగాలకు ఏడాదికి 70 వేల నుంచి 95 వేల డాలర్లు (రూ.60 లక్షల నుంచి 80 లక్షలు) జీతం ఉంటుందని, గంటకు 33 నుంచి 45 డాలర్లు ఇస్తారని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్లు, యాక్టివ్ ఇండియన్ ఆర్ఎన్ లైసెన్స్, ఎన్ క్లెక్స్ పాస్, ఐఈఎల్టీఎస్ 6.5 లేదా ఓఈటీ గ్రేడ్ బి, కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు.
Overseas Jobs | ఫిజిలో మల్టిపుల్ సెక్టార్లలో..
ఫిజిలో మల్టిపుల్ సెక్టార్లలో గంటకు 6 ఫిజి డాలర్లు, నెలకు 1,250 నుంచి 1,460 ఫిజి డాలర్ల జీతంతో 2 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలో కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సివిల్ కన్ స్ట్రక్షన్ ఆఫీస్ స్టాఫ్, ఎర్త్ మూవింగ్ వర్కర్, సైట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, సీఎన్సీ ఆపరేటర్, ఫ్యాక్టరీ వర్కర్ పోస్టులకు గంటకు 26.44 ఆస్ట్రేలియన్ డాలర్ల జీతం ఉందని, కనీసం 2 ఏళ్ల అనుభవం అవసరమని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం http://www.tomcom.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని లేదా 08035524946, 6305743423 నంబర్లలో సంప్రదించాలని, అలాగే కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం రూమ్ నంబర్ 121 లో జిల్లా ఉపాధి అధికారిని సంప్రదించాని తెలిపారు.
ఇది కూడా చదవండి..: OTP Scam | ఓటీపీ చెప్పాడు.. రూ.లక్షల్లో కోల్పోయాడు..