Bharat Summit Protest | భారత్ సమ్మిట్​పై బీజేపీ ఆగ్రహం.. కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం..

70 దేశాలకు చెందిన వెయ్యి మంది దేశ వ్యతిరేక శక్తులైన విదేశీయులను హైదరాబాద్​కు పిలిచారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bharat Summit Protest | భారత్ సమ్మిట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం 70 దేశాలకు చెందిన వెయ్యి మంది దేశ వ్యతిరేక శక్తులైన విదేశీయులను హైదరాబాద్​కు పిలిచారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని(Kamareddy) నిజాంసాగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

Bharat Summit Protest | పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట..

ఈ క్రమంలో కాసేపు పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, భవిష్యత్తు తరాల కోసం సమ్మిట్​లు పెడతారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భారత దేశాన్ని ద్వేషించే శక్తులతో, నయా పైసా పనికి రాని 70 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మందిని పిలిచి దేశంపై, భారత వ్యవస్థలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సొమ్ముతో పెట్టిన సమ్మిట్ వల్ల ప్రజలకు గానీ, రాష్ట్రానికి గానీ ఒక్క రూపాయి కూడా ప్రయోజనం లేదన్నారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తేనే.. గిగ్ వర్కర్లకు పూర్తి న్యాయం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *