అక్షరటుడే, భీమ్‌గల్: Mission Bhagiratha Pipeline | ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, అక్రమంగా పంట పొలాలకు నీటిని మళ్లించుకున్న ఇద్దరు వ్యక్తులపై భీమ్‌గల్ (Bheemgal) పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్సై చిరంజీవి వివరాలు వెల్లడించారు.
Mission Bhagiratha Pipeline | ప్రధాన పైప్‌లైన్ ధ్వంసం..
మండలంలోని కారేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌ను ధ్వంసం చేసి, తమ పొలాలకు నీటిని తరలించుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలకు తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ శాఖ ఇంజనీర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, తాగునీటిని అక్రమంగా వాడుకున్నా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: గిగ్ వర్కర్స్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు