అక్షరటుడే, బోధన్: Bodhan Water Supply | నిజామాబాద్ జిల్లా బోధన్ (Bodhan) ప్రజలకు బిగ్ అలర్ట్ ఇది.. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నీటి సరఫరాల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
Bodhan Water Supply | రోజు విడిచి రోజు నీటి సరఫరా..
బోధన్ మున్సిపల్ పరిధిలో సోమవారం నుంచి రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా అవుతుందని బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో సింగూరు జిల్లాలు అడుగంటిన దృష్ట్యా కలెక్టర్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
ఇది కూడా చదవండి: గిగ్ వర్కర్స్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు