అక్షరటుడే, డిచ్‌పల్లి: OTP Scam | బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి ఓటీపీ అడగగా.. నంబర్ చెప్పడంతో ఓ వ్యక్తి రూ.లక్షల్లో కోల్పోయాడు. అకౌంట్ ఖాళీ చేసిన కేటుగాళ్లు తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు.
OTP Scam | డిచ్‌పల్లి మండలం ధర్మారంలో..
వివరాల్లోకి వెళ్తే.. డిచ్‌పల్లి మండలం (Dichpally Mandal) ధర్మారం(బీ) గ్రామానికి చెందిన జాస్తి ఓంకార్ ఇటీవల కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, మీరు క్రెడిట్ కార్డు తీసుకున్నారు కదా.. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడిగారు. ఫోన్ చేసిన వ్యక్తులు బ్యాంకు సిబ్బందిగా నమ్మిన ఓంకార్ వారికి ఓటీపీలు తెలిపారు. దీంతో కొద్దికొద్దిగా ఆయన బ్యాంకు ఖాతాలోని మొత్తం రూ.3.50 లక్షలు మాయమయ్యాయి. ఖాతాలోని నగదు మాయమైనట్లు గుర్తించిన ఓంకార్ వెంటనే తనకు ఫోన్ చేసిన నంబర్‌కు తిరిగి కాల్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి డిచ్‌పల్లి ఎస్సై ఆరీఫ్‌కు ఫిర్యాదు చేశాడు. అపరిచితులకు ఓటీపీలు చెప్పవద్దని, బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసినా వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను వెల్లడించవద్దని ఎస్సై సూచించారు.
ఇది కూడా చదవండి..: Robotic Joint Replacement | రోబోటిక్ సర్జరీతో విజయవంతంగా జాయింట్ రీప్లేస్మెంట్..