Robotic Joint Replacement | రోబోటిక్ సర్జరీతో విజయవంతంగా జాయింట్ రీప్లేస్​మెంట్​..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Robotic Joint Replacement | యశోద ఆస్పత్రి (Yashoda Hospital) సికింద్రాబాద్ బ్రాంచ్​లో రోబోటిక్ సర్జరీ ద్వారా జాయింట్ రీప్లేస్​మెంట్​ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ హెచ్. వినయ్ కుమార్ తెలిపారు. కామారెడ్డిలోని యశోద బ్రాంచ్ క్లినిక్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Robotic Joint Replacement | రోబోటిక్ సిస్టం ద్వారా పరీక్షలు

జాయింట్ రీప్లేస్​మెంట్​.. సర్జరీ చేసే ముందు రోబోటిక్ సిస్టం ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా ఎంత వరకు బోన్ కటింగ్ చేయాలో స్పష్టంగా తెలుస్తుందని, ఎంత వరకు సర్జరీ అవసరమో అంత వరకే చేసే అవకాశం ఉంటుందని వివరించారు. స్పోర్ట్స్ సమయంలో ఏర్పడే జాయింట్ పెయిన్ కు సంబంధించిన సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఆర్థోస్కోపీ ద్వారా చిన్న రంధ్రం చేసి ట్రీట్మెంట్ చేస్తామన్నారు. రోబోటిక్ సిస్టం ద్వారా ఇప్పటి వరకు అనేక సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని, యశోద ఆస్పత్రిలో లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కామారెడ్డికి చెందిన పలువురికి ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామని డా. వినయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి యశోద బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Police Station | పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *