Nizamabad Police Station | పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సీపీ సాయిచైతన్య ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Police Station | పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని మహిళా పోలీస్​స్టేషన్​ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

Nizamabad Police Station | కిట్​ ఆర్టికల్స్​ తనిఖీలు..

ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీపీ అనంతరం స్టేషన్​ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి సంబంధించినటువంటి కిట్ ఆర్టికల్స్​ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సీపీ పరిశీలించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు త్వరితగతిన స్పందించి బాధితులకు భరోసా కల్పిస్తూ సేవలందించాలని సూచించారు. మహిళా బాధితులు తమ సమస్యలను ఎటువంటి భయాందోళనలు లేకుండా పోలీసులకు తెలియజేసే విధంగా వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు.

సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది 24గంటలు తమ హెడ్ క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలన్నారు. దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సిబ్బంది ప్రతి ఆర్నెళ్లకొకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్​ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఏసీపీ ప్రకాష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్​ శ్రీలత, ఎస్సైలు రహమతుల్లా, రాజేశ్వర్, జాన్సన్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bodhan Municipal Meeting | బల్దియా సమావేశంలో కౌన్సిలర్లను మాట్లాడనివ్వరా..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *