Bodhan Municipal Meeting | బల్దియా సమావేశంలో కౌన్సిలర్లను మాట్లాడనివ్వరా..?

బల్దియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Bodhan Municipal Meeting | బల్దియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్​ సమావేశంలో అధికారులను ఘెరావ్​ చేశారు.

Bodhan Municipal Meeting | ఏకపక్షంగా ఎజెండా ఆమోదించారని..

బోధన్ (Bodhan) మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మున్సిపల్ ఛైర్​పర్సన్ తూము పద్మ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన కౌన్సిలర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎజెండాను ఆమోదించారని కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలు, సమస్యలపై చర్చ నిర్వహించాల్సి ఉండగా.. అలాంటిదేమీ లేకుండా నేరుగా ఎజెండా ఆమోదించడం ఎంతవరరకు సబబన్నారు. కౌన్సిలర్లకు మాట్లాడే అవకాశం కల్పించిన అనంతరం ఎజెండా అంశాలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై సమావేశంలో అధికారులకు, అధికార, విపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కమిషనర్​ మీటింగ్​ హాల్​ నుంచి బయటకు వెళ్లిపోతుండగా వైస్​ఛైర్మన్​ ఆధ్వర్యంలో బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు అడ్డుకుని ఘెరావ్​ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వారిని సముదాయించారు. వైస్ ఛైర్మన్ మీర్ ఇలియాస్ అలీ, బీజేపీ ఫ్లోర్ లీడర్ కొల్లిపాక రేణుక, కౌన్సిలర్లు తమ నిరసన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Sign Language Day | బధిరులకు అండగా ఉంటా..: అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *