అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Illegal Constructions | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో పలుచోట్ల కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లను చేపట్టారు. రాంపల్లి–చెర్లపల్లి రోడ్డులో అనధికారిక షెడ్డును జేసీబీ సాయంతో తొలగించారు. రాంపల్లిలో రోడ్డు ఆక్రమణలను, శ్రీనిధి కాలేజీ సమీపంలో అనుమతులు లేకుండా నిర్మించిన పెంట్‌హౌస్‌ను కూల్చివేశారు. యమ్నంపేటలో సైతం అనధికారికంగా నిర్మించిన పెంట్‌హౌస్‌ను తొలగించారు. ఈ సర్కిల్ పరిధిలో ప్రజా ప్రదేశాలను ఖాళీ చేయడం, రోడ్డు సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రజా భద్రతను పెంపొందించడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Illegal Constructions | సైబరాబాద్‌లో..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం అధికారులు అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగిస్తున్నారు. సోమవారం 16 నిర్మాణాలను కూల్చివేశారు. మరో మూడు భవనాలకు నోటీసులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో సైతం కూల్చివేతలు కొనసాగుతండటంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Khairatabad Assembly Seat | ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల