Khairatabad Assembly Seat | ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ సచివాలయం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Khairatabad Assembly Seat | ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ సచివాలయం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి అధికారికంగా వెల్లడించారు.

Khairatabad Assembly Seat | 2024 ఏప్రిల్ నుంచే అమల్లోకి..

దానం నాగేందర్ అనర్హతకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి గెజిట్‌లో స్పష్టం చేశారు. 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఆయనపై అనర్హత వేటు అమల్లోకి వస్తుందని, అప్పటి నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిబంధనలు, చట్టపరమైన ఆదేశాల మేరకే సచివాలయం ఈ చర్యలు తీసుకుంది. ఈ గెజిట్ విడుదల కావడంతో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.

Khairatabad Assembly Seat | దిమ్మతిరిగే షాక్ ఇస్తాం..

మరోవైపు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇస్తామని, ఫలితం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ‘ఓటు చోరీ’ చేస్తోందని, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి గెలుపు వెనుక కూడా అదే జరిగిందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘సర్‌’ (SIR) లోపాల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని దానం నాగేందర్ కోరారు.

ఇది కూడా చదవండి:  AMCA Fighter Jet | హెచ్‌ఏఎల్‌కు భారీ షాక్.. ఏఎంసీఏ యుద్ధ విమాన ప్రాజెక్ట్ రేసు నుంచి ఔట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *