Police Prajavani Nizamabad | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు: సీపీ సాయిచైతన్య

పోలీస్​ ప్రజావాణిలో బాధితులు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Prajavani Nizamabad | పోలీస్​ ప్రజావాణిలో బాధితులు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చని సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) సీపీ కార్యాలయంలోని తన ఛాంబర్​లో పోలీస్​ ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు.

Police Prajavani Nizamabad | 33 ఫిర్యాదుల స్వీకరణ..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి సీపీ సాయిచైతన్య 33 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విన్న ఆయన చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: పసిబిడ్డకు కేటీఆర్​ నామకరణం..ఆ పాప పేరు ఏంటో చూడండి! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *