అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Home Guard | యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలోని ఓ మండలంలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kamareddy Home Guard | గణేష్ నిమజ్జనం సందర్భంగా..
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఓ మండలంలో రెండు రోజుల క్రితం గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై సమక్షంలోనే ఓ హోంగార్డు యువకులను ఉద్దేశించి పత్రికలో ప్రచురించలేని విధంగా దుర్భాషలాడాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, తమ సిబ్బంది చేసిన దురుసు వ్యాఖ్యలపై మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీస్ సిబ్బందే ఇలా నోరు జారడం సరికాదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.