అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Food Safety Raids | జిల్లాలో ఆహార భద్రతా అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంతో (Kamareddy) పాటు భిక్కనూర్ (Bhikkanoor) ప్రాంతాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
Kamareddy Food Safety Raids | వంటగదుల్లో దుర్వాసన
మాల్గుడి మల్టీ రెస్టారెంట్, హోటల్ ఆనంద్ భవన్, నషా బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు మరికొన్ని హోటళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు చోట్ల తీవ్ర పరిశుభ్రత లోపాలను గుర్తించారు. వంటశాలల్లో పాత నూనెను వాడటం, ఆహార పదార్థాలను బహిరంగంగా నిల్వ ఉంచడం, సిబ్బంది చేతికి గ్లౌజులు, తలకు టోపీలు ధరించకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. కొన్ని హోటళ్లు ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.
Kamareddy Food Safety Raids | రంగులు కలిపిన ఆహారపదార్థాలు..
ఆహార పదార్థాలకు రంగు కోసం అక్రమంగా నిల్వ ఉంచిన కృత్రిమ రంగులను అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు. ప్రయోగశాల నివేదికల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారి విక్రమ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ డే 19.. ట్విస్టులే ట్విస్టులు..!