అక్షరటుడే, బాన్సువాడ: SGF Archery Selections | మండలంలోని తిర్మలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్చరీ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు.
SGF Archery Selections | ఆర్చరీకి ఏకాగ్రత అవసరం..
ఈ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్ కన్వీనర్, ఎంఈవో నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఆర్చరీ క్రీడ విద్యార్థుల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, పట్టుదలను పెంపొందిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. సెలక్షన్ పోటీలను పూర్తి పారదర్శకతతో నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఆర్చరీ వంటి క్రీడలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్, సర్పంచ్ సాయిగౌడ్, ఉప సర్పంచ్ ఖలీల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chakali Ailamma | ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ