Chakali Ailamma | ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  కొనియాడారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Chakali Ailamma | సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  (Collector Ashish Sangwan) కొనియాడారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

Chakali Ailamma | అణగారిన వర్గాల కోసం..

పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన తెగువ, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె చేసిన పోరాటం ప్రజాస్వామ్య విలువలను, సమానత్వాన్ని బలోపేతం చేసిందని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, గౌరవం కల్పించడమే నిజమైన నివాళి అని తెలిపారు. ఆమె స్ఫూర్తితో సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్​వై గిరి, తహశీల్దార్ హిమబిందు, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి, వైస్​ ఛైర్​పర్సన్​ గోదావరి స్వామి, టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Chakali Ailamma Jayanti | చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం : టీపీపీసీ చీఫ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *