Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: షబ్బీర్​ అలీ

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.

Indiramma Houses | 106 మంది లబ్ధిదారులకు..

ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ఇల్లు కాదని, ప్రతి పేద కుటుంబాల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి, వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి, కమిషనర్ పర్వతాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, కౌన్సిలర్లు సావిత్రి, అఖిల, స్వప్న, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, యూనుస్, షేరు,గంగాధర్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy RTO Inspections | ఆర్టీవో అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *