Paddy Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:  Paddy Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు. నగరంలో మెప్మా ఆధ్వర్యంలో శ్రద్ధానంద్​ గంజ్​, జీజీ కళాశాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

Paddy Procurement | మద్దతు ధర పొందాలి..

కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మేయర్​ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు (Farmers) తమ ఉత్పత్తిని సులభంగా అమ్ముకునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆమె అన్నారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. మెప్మా ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు పారదర్శకంగా సకాలంలో చెల్లింపులు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది రైతులకు కేంద్రాల వద్ద పాటించాల్సిన విధివిధానాలు, అవసరమైన పత్రాలు కొనుగోలు ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: షబ్బీర్​ అలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *