అక్షరటుడే, ఆర్మూర్: Madapur Bhu Bharati Resurvey | జక్రాన్పల్లి మండలం (Jakranpally Mandal) మాదాపూర్ గ్రామంలో జరుగుతున్న భూభారతి రీ-సర్వే ప్రక్రియను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా పరిశీలించారు. శనివారం గ్రామానికి చేరుకున్న ఆయన సర్వే బృందం చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Madapur Bhu Bharati Resurvey | భూముల కొలతలు, రికార్డుల నమోదు..
భూముల కొలతలు, రికార్డుల నమోదు, రైతుల నుంచి సేకరిస్తున్న వివరాలను సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే బృందానికి పలు సూచనలు చేశారు. రీ-సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. రోజువారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వేలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bhiknoor Road Accident | అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న కారు