Gig Workers Policy | గిగ్​ వర్కర్లకు అండగా ఉంటాం : రాహుల్​ గాంధీ

గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gig Workers Policy|గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హైదరాబాద్​లో గిగ్​ వర్కర్స్​ పాలసీ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

గిగ్​ వర్కర్లతో సమావేశం అయి వారి సమస్యలు తెలుసుకున్నట్లు రాహుల్ తెలిపారు. గిగ్ వర్కర్స్‌కు సపోర్ట్‌గా ఉంటామని, వారి సమస్యలు తీరుస్తామన్నారు. ఆన్‌లైన్‌లో అన్ని ప్లాట్‌ఫామ్‌ల డేటా ఉంది కానీ.. గిగ్ వర్కర్ల డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు. వారికి ఎంత జీతం వస్తుంది ఎవరికీ తెలియదన్నారు. ఇకపై గిగ్​వర్కర్లు సంపాదించే ప్రతీ పైసా లెక్క వారికి తెలుస్తుందన్నారు. గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వైఫైతో కూడిన షెల్టరు ఏర్పాటు చేస్తోందని చెప్పారు.

Gig Workers Policy | కొత్త చట్టంతో..

21వ శతాబ్దం డేటాకు సంబంధించిన శతాబ్దం అని రాహుల్ అన్నారు. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబెర్ వంటి సంస్థలన్నీ డేటా ఆధారంగానే పనిచేస్తున్నాయని చెప్పారు. కానీ దేశంలో ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు తమ సొంత డేటా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ చట్టం వారికి డేటాపై హక్కును కల్పిస్తుందన్నారు. ‘మీరు చేసే పని, పూర్తి చేసే రైడ్‌లు, ఆ రైడ్‌లకు మీకు చెల్లించే డబ్బు వంటి వివరాలన్నీ మీ మొబైల్ ఫోన్‌లోనే చూసుకునేలా తెలంగాణ ప్రభుత్వం మీకు హామీ ఇస్తోంది” వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Bike Rally | బైక్​ ర్యాలీలో పాల్గొన్న రాహుల్​ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *