Gig Workers Policy | గిగ్​ వర్కర్స్​ పాలసీ ప్రారంభించిన రాహుల్ గాంధీ

రాష్ట్రంలో గిగ్​ వర్కర్స్​ పాలసీని రాహుల్​గాంధీ ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gig Workers Policy | రాష్ట్రంలో గిగ్​ వర్కర్స్​ పాలసీని రాహుల్​గాంధీ ప్రారంభించారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం అమలు చేయనున్నారు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించనున్నారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసిన చట్టం కాదన్నారు. ప్రభుత్వం గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇస్తే.. మట్టిలో కలిసినా మాట తప్పరని అన్నారు. రాహుల్​, సీఎం రేవంత్​ మొదట గిగ్​వర్కర్లతో కలిసి బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ పాలసీని రాహుల్​ గాంధీ చేతుల మీదుగా ప్రారంభింంచారు.

Gig Workers Policy | విశ్రాంతి తీసుకునే సౌకర్యం

ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ‘గిగ్ స్టాప్’ అనే విశ్రాంతి, సేదతీర్చే సదుపాయాన్ని ప్రారంభించింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు విరామం తీసుకోవడానికి ఇది వారికి ఉపయోగ పడుతుంది.డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర గిగ్ వర్కర్ల అవసరాలను తీర్చేలా రూపొందించిన ఈ సదుపాయంలో కూర్చునే ఏర్పాట్లు, ఉచిత వై-ఫై, ఛార్జింగ్ పాయింట్లు, పురుషులకు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు, బంక్ బెడ్‌లతో కూడిన ప్రత్యేక విశ్రాంతి స్థలాలు ఉన్నాయి. అంతేగాకుండా పార్కింగ్​ స్థలం ఉంటుంది.

Gig Workers Policy | ఐదు గిగ్ స్టాప్‌ల ఏర్పాటు

ప్రభుత్వం ఇప్పటికే ఐదు గిగ్ స్టాప్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయాణాలలో ఎక్కువ గంటలు గడిపే కార్మికులకు ప్రాథమిక సౌకర్యాలను, పనుల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలాన్ని అందించడం దీని ఉద్దేశం.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Bike Rally | బైక్​ ర్యాలీలో పాల్గొన్న రాహుల్​ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *