అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Bharat Remarks | ఇటీవల కుప్పం Kuppam లో ఎమ్ఎల్సీ భరత్ మాట్లాడుతూ… ‘చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం, యుద్ధం గెలుస్తాం’ అని మాట్లాడు.. అసలు తెలివుండి మాట్లాడుతున్నారా భరత్ ? ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నారా, ఎక్కడ పనిచేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, భాజపా సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
MLC Bharat Remarks | చంపేయడాలే కదా మీ ప్రొఫైల్
ఈ రాక్షస ప్రవృత్తిని మీరు మానుకోరా? మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు బాబాయ్ గొడ్డలిపోటు, డిక్కీలో ప్రయాణాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎవరైనా మీకు ఎదురు మాట్లాడితే రక్తచరిత్ర, వాళ్లను చంపేయడాలు… ఇదే కదా మీ ప్రొఫైల్ అంతా! అంటూ ఘాటుగా విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ని అరాచక ప్రదేశ్‌గా మార్చారు కదా! ఆంధ్రప్రదేశ్‌ని రాక్షస ప్రదేశ్‌గా మార్చారు కదా! అని ద్వజమెత్తారు.
MRP Overcharging Fine | రూ.7 కక్కుర్తికి..రూ.7 లక్షల ఫైన్
ఇప్పుడు ఎన్డీయే కూటమి (చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్) వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాలి.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకోవాలని మేము ఉంటే… మీరు మాట్లాడిన మాటలు ఏంటి? పద్ధతి ఏందయ్యా అది? చావడాని… రక్తాభిషేకం చేస్తారా? ఏం రక్తాభిషేకం చేస్తారు? అని నిలదీశారు.
MLC Bharat Remarks | ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా..
2019 నుంచి మీరు చేసిన దానికే కదా.. మీ ‘ఫ్యాన్’ రెక్కలు విరిచేసి, 11 స్థానాలకు పరిమితం చేసి, మీ అధినాయకుడికి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి, ప్రజలు మిమ్మల్ని ఛీదరించుకుంటే… ఈరోజు తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రజాక్షేత్రంలో మీరు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడటం మంచిది కాదు!.. అని హితవు పలికారు.
భరత్ వ్యాఖ్యలను వెంటనే సుమోటోగా తీసుకుని, భరత్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఏకగ్రీవాలు’ పేరుతో… 2019 నుంచి 2024 వరకు మీరు ఎన్నికలు జరిపారా..? మీరు జరిపింది ఎన్నికలు కాదు, ఎంపికలు! ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్! అని విమర్శించారు.
MLC Bharat Remarks | యుద్ధం చేయాలనుకుంటే బోర్డర్‌కు వెళ్లండి..
మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా అభ్యర్థిని నిలబెడతాం. ప్రజలతో ఓట్లు వేయించుకుంటాం. మేము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, తద్వారా మేము ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మీరు అంత యుద్ధం గిద్ధం చేయాలంటే మీకో మంచి సలహా ఇస్తా నేను.. మీరు వెంటనే బంగ్లాదేశ్ బోర్డర్కో, చైనా బోర్డర్కో లేకపోతే పాకిస్తాన్ బోర్డర్కో అక్కడికి వెళ్లి… ఆ దేశాల మీద యుద్ధం చేయండి, దేశభక్తి అయినా ఉంటుంది! అని సలహా ఇచ్చారు.
కానీ, మీరిలా ఇక్కడుండి ‘యుద్ధం చేస్తాం’ అంటే తోలు తీస్తాం!.. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఉక్కుపాదంతో తొక్కివేస్తాం.. శాంతిభద్రతలు కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా మా ఎన్డీయే కూటమి పని చేస్తుంది..” అని స్పష్టం చేశారు.