Ganesh Immersion | గణేశ్ నిమజ్జనానికి హైడ్రా చర్యలు

కూకట్​పల్లి ఐడీఎల్ చెరువులో గణేష్ నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా చర్యలు చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కూకట్​పల్లి ఐడీఎల్ చెరువు (IDL Lake)లో గణేష్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. వేలాదిగా తరలి వచ్చే విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరేలా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రధాన రహదారివైపు చెరువును లోతుగా త‌వ్వి.. నీటితో నింపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. 20 అడుగులకు పైగా వ్యర్థాలతో కూడిన పూడికను తొలగించడంతో ఊట నీరు కూడా వ‌చ్చి చేరుతోంది. ఈ నీటికి తోడు అదనంగా నీటిని నింపుతామని అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జనం సమయానికి ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. హైడ్రా (HYDRAA) క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఇప్ప‌టికే చెరువును సంద‌ర్శించి నిమ‌జ్జ‌నానికి ఇబ్బంది లేకుండా.. చేస్తున్న ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు.

Ganesh Immersion | పనులకు ఆటంకం లేకుండా..

ఐడీఎల్ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే.. నిమ‌జ్జ‌నానికి అనువుగా నీరు చేరేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రంగనాథ్​ సూచించారు. చెరువు మిగ‌తా ప్రాంతంలో ఉన్న నీటిని మొత్తం పూడిక తీసిన చోటుకు వచ్చేలా చేయాలన్నారు. అక్కడ నిమజ్జనం చేయాలని సూచించారు. దీంతో అధికారులు పూడిక తొలగించి చెరువులోని కొంతమేర నీరు నింపుతున్నారు.

దీనిని కూడా చదవండి : E20 Petrol | E20 పెట్రోల్‌తో వాహనాలు పాడవుతాయనడంలో నిజం లేదు: మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *