అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Bike Rally | లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో బైక్ ర్యాలీని ప్రారంభించారు.
రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోవోటెల్ నుంచి శిల్పారామంకు బయలుదేరారు. అనంతరం శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో గిగ్ వర్కర్లు హాజరుకాగా జయభేరి గ్రౌండ్స్‌లో జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి..: Hafeezpet Fire Accident | హఫీజ్‌పేట్‌లో అగ్ని ప్రమాదం