Hafeezpet Fire Accident | హఫీజ్​పేట్​లో అగ్ని ప్రమాదం

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్​పేట్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hafeezpet Fire Accident | మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్​పేట్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లై ఓవర్​ పక్కన ఉన్న పెయింటింగ్​ షాపులో శనివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Hafeezpet Fire Accident | రూ.60 లక్షల ఆస్తినష్టం

పెయింటింగ్ షాపులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పెయింటింగ్​ డబ్బాలకు మండే స్వభావం ఉంటడంతో క్షణాల్లో దుకాణం మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందంఇంచారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్​లతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే షాప్​లోని సామగ్రి కాలిబూడిద అయింది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Fox Sagar Lake | మరో చెరువు అభివృద్ధికి హైడ్రా చర్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *