Eagle Force | గోవా నుంచి డ్రగ్స్​ రవాణా.. ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్​ ఫోర్స్​

గోవా నుంచి డ్రగ్స్​ రవాణా చేస్తున్న కీలక నిందితుడిని హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Force | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. పోలీసులు, ఈగల్​ ఫోర్స్​, ఎక్సైజ్​ అధికారులు దాడులు చేస్తున్నా.. డ్రగ్స్​ దందా మాత్రం ఆగడం లేదు.

హైదరాబాద్​ పోలీసులు తాజాగా గోవా (Goa) నుంచి డ్రగ్స్​ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. నగరానికి ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా గంజాయి సరఫరా అవుతోంది. అలాగే గోవా, ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుంచి డ్రగ్స్​ తీసుకొచ్చి విక్రయాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గోవాలో ఈగల్ ఫోర్స్‌, పంజాగుట్ట పోలీసుల సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. గోవా-హైదరాబాద్‌ డ్రగ్స్‌ రాకెట్‌ కీలక సూత్రధారి కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని అరెస్ట్​ చేశారు. పంజాగుట్టలో పట్టుబడ్డ నిందితుడి సమాచారంతో గోవా బయటపడ్డాయి.

Eagle Force | నగదు డిపాజిట్లపై అనుమానం

మే 9న పంజగుట్ట పోలీసులు 13 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల చరస్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. అనంతరం గోవా నుంచి డ్రగ్స్​ తీసుకు వస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్​ నిర్వహించి కీలక నిందితుడు క్రిస్టీని అరెస్ట్ చేశారు. రూ.48.4 లక్షల బ్యాంకు రుణాలు, ఏటీఎంల ద్వారా జరిగిన నగదు డిపాజిట్లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌తో 25 మందికి పైగా తెలంగాణ వాసులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాను సమన్వయం చేయడంలో ఒక నైజీరియన్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Sharannavaratri Celebrations | శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకల ప్రత్యేకతలివే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *