అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi Chennai visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చెన్నైలో పర్యటించారు. సుమారు రూ. 4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోదీ పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. NH-744లోని 36 కిలోమీటర్ల, నాలుగు లేన్ల వడుగపట్టి-తేర్కువెంగనల్లూరు విభాగాన్ని ప్రారంభించనున్నారు. NH-83లోని నాగపట్టణం-తంజావూరు విభాగంలో నాలుగు లేన్ల తిరువారూర్ బైపాస్కు శంకుస్థాపన చేస్తారు. రూ. 750 కోట్లకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
PM Modi Chennai visit | ఓడరేవు ప్రాజెక్టులకు..
ప్రధానమంత్రి సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సరుకు రవాణా సామర్థ్యాన్ని విస్తరించడానికి ఓడరేవు సంబంధిత ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తారు. చెన్నై పోర్టులో నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇవి అందుబాటులోకి వస్తే సరుకు నిల్వ, నిర్వహణ మెరుగు పడనుంది. గోదాముల సామర్థ్యం పెరగనుంది.
చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం..
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రో రైలులో ప్రయాణించారు. పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణిస్తూ కొత్త మెట్రో మార్గాన్ని సందర్శించారు. చెన్నై మెట్రో ఫేజ్-2లో భాగంగా ఈ మార్గాన్ని ప్రారంభించారు.
#pmmodi #chennaimetrorail #tamilnadu #metro #aksharatoday
— Akshara Today | Telugu News (@AksharaToday) October 11, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Police Inspector Case | పెళ్లి పేరిట నమ్మించి మోసం.. ఖైరతాబాద్ డీఐపై కేసు నమోదు