అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Police Inspector Case | హైదరాబాద్‌లో రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు అధికారే ఘాతుకానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా (DI) పనిచేస్తున్న బాలస్వామి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా, మానసికంగా మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో సైదాబాద్ ( Saidabad ) పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Hyderabad Police Inspector Case | నమ్మించి మోసం..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో ఆమెకు ఇన్‌స్పెక్టర్ బాలస్వామితో పరిచయం ఏర్పడింది. 2017 నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. 2021లో తన భర్త చనిపోయిన తర్వాత కూడా అతడిని నమ్మి బంధాన్ని ముందుకు తీసుకెళ్లానని బాధితురాలు పేర్కొంది. అయితే 2024లో బాలస్వామికి అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారనే విషయం ఆమెకు తెలిసింది. దీనిపై అతడిని నిలదీయగా.. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
Hyderabad Police Inspector Case| రిమాండ్‌కు తరలింపు..
2025 జనవరి నుంచి తనను పూర్తిగా దూరం పెట్టడంతో పాటు లైంగికంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. న్యాయం చేయాలంటూ ఆమె సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Sharannavaratri Celebrations | శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకల ప్రత్యేకతలివే!