అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్తో ఓటు హక్కు కోల్పోయిన వారిని తీసుకు వస్తానని, తేదీ, సమయం చెప్పాలన్నారు.
ఎస్ఐఆర్ (SIR)పై తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలని రామ్చందర్రావు ఇటీవల పార్టీ శ్రేణులకు సూచించారు. దీనిపై పొన్నం స్పందించారు. ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుందామని చెప్పాల్సింది పోయి.. ఓటు హక్కు కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా ప్రశ్నించడం సరికాదన్నారు. తనకు సమయం చెబితే.. ఓటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందుతున్న బాధితులను, ఆధారాలతో సహా తీసుకు వస్తానని చెప్పారు.
Ponnam Prabhakar | అర్హులకు న్యాయం చేయాలి
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. తన తండ్రి పేరులో వ్యత్యాసాన్ని సాకుగా చూపి తన ఓటును తొలగించే కుట్ర చేశారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు పోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. సవరణ పేరుతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
దీనిని కూడా చదవండి : Bollaram Murder Case | ఉద్యోగం నుంచి తొలగించడంతో చిన్నారి కిడ్నాప్, హత్య