Bollaram Murder Case | ఉద్యోగం నుంచి తొలగించడంతో చిన్నారి కిడ్నాప్​, హత్య

ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే సెక్యూరిటీ గార్డు బొల్లారంలో చిన్నారిని కిడ్నాప్​ చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bollaram Murder Case | సికింద్రాబాద్ (Secunderabad)​లోని బొల్లారంలో చిన్నారి కిడ్నాప్​, హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే సెక్యూరిటీ గార్డు విక్రమ్​ పాపను కిడ్నాప్​ చేశాడు.

సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో వారం క్రితం అతడిని విల్లా అసోసియేషన్​ ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు చిన్నారి అరేలియాను కిడ్నాప్​ చేయాలని ప్లాన్​ వేశాడు. ఈ మేరకు మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషియన్​ సహకారంతో బాలికను అపహరించాడు. అనంతరం వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్​ చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు వారికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు.

Bollaram Murder Case | బతుకమ్మ వేడుకలు ఉండటంతో..

పాప కిడ్నాప్ సమయంలో విల్లా కమ్యూనిటీలో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) నిర్వహించారు. ఆ సమయంలో పాపను కిడ్నాప్​ చేశారు. చిన్నారి అరుపులు వినపడకుండా ఎలక్ట్రీషియన్​ స్పీకర్ సౌండ్ ఎక్కువగా పెట్టాడు. కిడ్నాప్​ అనంతరం చిన్నారిని విక్రమ్​ బయటకు తీసుకు వెళ్లలేకపోయాడు. పోలీసులు వస్తారని చిన్నారిని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు. నిందితుడికి సహకరించిన మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రిషియన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్​ కోసం గాలిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Tahsildar Suspended | రైతును అవమానించిన గజ్వేల్​ తహశీల్దార్​పై వేటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *